ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన
వీరబల్లి, ఆగస్టు 29 (రాజనీతి): కడప పుష్పగిరి కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో వీరబల్లి ఎస్డీకేఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన సుమారు 90 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా 17 మందికి శుక్లాలు ఉన్నట్లు గుర్తించారు. వారిని ఉచిత శస్త్రచికిత్స కోసం కడపకు తరలించారు. మరో 40 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేశారు. విఆర్డీఎస్ అధ్యక్షుడు సురేంద్రారెడ్డి, ఆసుపత్రి కోఆర్డినేటర్ సంజయ్, కళాశాల డైరెక్టర్ రవిశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.