మరో జల ప్రళయం.. నేపాల్‌కు మళ్లీ వరద ముప్పు!
కాఠ్మాండు: వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మరో ముప్పు పొంచి ఉంది. టిబెట్‌లోని సరిహద్దు ప్రాంతంలో డ్యామ్ తెగిపోవడంతో నీటి మట్టాలు పెరుగుతున్న నేపథ్యంలో నేపాల్ అధికారులు తాజా వరద హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా త్రిశూలి, భోటేకోశి నదుల పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, సహాయక సిబ్బంది, భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. మళ్లీ ముంచుకొస్తున్న ముప్పు ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన ఆకస్మిక వరద ఇప్పటికే భారీ ప్రాణ, ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. భోటేకోశి నది లోయలోకి భారీగా నీరు, మట్టి, రాళ్లు దూసుకురావడంతో ఇళ్లు, వంతెనలు,...