పోలీసుల చొరవతో బాలుడి క్షేమంగా ఇంటికి చేరిక
రేణిగుంట, ఆగస్టు 29 (రాజనీతి): తల్లిదండ్రులు చదువుపై మందలించడంతో అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చిన పదేళ్ల బాలుడు పోలీసుల చొరవతో క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేరాడు. బాలుడు ఒంటరిగా రోడ్డుపై తిరుగుతుండటాన్ని గమనించిన ఓ ఆటో డ్రైవర్ మానవతా దృక్పథంతో స్పందించి పోలీసులకు అప్పగించడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన తొలగింది. తిరుపతి నగరానికి చెందిన ధనుష్ (10) జీవకోనలోని శ్రీ సదీశ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. చదువులో సరిగా శ్రద్ధ చూపడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన బాలుడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. విషయం తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలో బాలుడు మంగళం రోడ్డువైపు...