గంజాయి నిర్మూలనే లక్ష్యం.. యువతను మత్తు నుంచి బయటపడేయడమే ధ్యేయం
రేణిగుంట, ఆగస్టు 29 (రాజనీతి): యువతను గంజాయి, మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడడంతో పాటు గంజాయి సరఫరా మూలాలను గుర్తించి నిర్మూలించేందుకు రేణిగుంట సబ్ డివిజన్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట సబ్ డివిజన్ పరిధిలో వారానికి రెండు నుంచి మూడు రోజులపాటు ప్రత్యేకంగా గంజాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ క్రమంలో శనివారం రేణిగుంట మండలం తారకరామనగర్లో ఆధునిక పరీక్షా కిట్లతో గంజాయి పరీక్షలు నిర్వహించారు. పోలీసులు అనుమానితులను పరీక్షించి గంజాయి వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరించారు. గంజాయి వినియోగాన్ని అరికట్టడంతో పాటు దాని వెనుక ఉన్న సరఫరా వ్యవస్థను గుర్తించడంపై పోలీసులు...