ఎస్‌ఐఆర్‌లో గుర్తించిన అభ్యంతరాలపై అధికారులు ఫోకస్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో కీలక దశ కొనసాగుతోంది. ముసాయిదా ఓటర్ల జాబితాలో గుర్తించిన వివిధ రకాల అభ్యంతరాలు, అసమానతలపై అధికారులు దృష్టి సారించారు. సంబంధిత ఓటర్లకు నోటీసులు జారీ చేసి.. వారి వివరాలను పరిశీలించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ సందర్భంగా మృతి చెందిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన పేర్లు తదితర అంశాలను పరిశీలించి ముసాయిదా జాబితాను రూపొందించారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో పేర్లు తొలగింపునకు గురయ్యాయి. అయితే అర్హత ఉన్న ఓటర్ల పేర్లు పొరపాటున తొలగిపోకుండా.. అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిశీలించి తుది జాబితాను...