నేపాల్‌లో జల ప్రళయం.. ఆత్మీయుల జాడ కోసం ఆర్తనాదం

కాఠ్మాండు: నేపాల్‌ను కుదిపేసిన భారీ వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఆకస్మికంగా విరుచుకుపడిన వరదలతో అనేక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రజలు పరుగులు తీసిన సమయంలో పలువురు ఒకరికి ఒకరు దూరమయ్యారు. వరదల ధాటికి కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినడంతో అనేక మంది ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నేపాల్ మీదుగా కైలాస్‌ మానసరోవర్‌ యాత్రకు వెళ్లిన భారతీయ యాత్రికుల పరిస్థితిపై కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ తదితర ప్రాంతాలకు చెందిన పలువురు యాత్రికులు, పర్యాటకులతో సంబంధాలు తెగిపోయినట్లు సమాచారం. కొందరు తమ క్షేమాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఊరట లభించినప్పటికీ.. మరికొందరి నుంచి ఎలాంటి సమాచారం...