ఉప్పెనల్లి ఆలయాల్లో బోయకొండ మాజీ చైర్మన్‌ దంపతుల పూజలు

పుంగనూరు, ఆగస్టు 25 (రాజనీతి): రామసముద్రం మండలం ఉప్పెనల్లి గ్రామంలోని శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి, శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయాలను బోయకొండ ఆలయ మాజీ చైర్మన్‌ ఎస్.కె. వెంకటరమణారెడ్డి, రతీదేవి దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, గ్రామస్తులు వారికి స్వాగతం పలికారు. దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించగా అర్చకులు తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందించారు. అనంతరం గ్రామస్తులు, టీడీపీ నాయకులు శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. పురాతన ఆలయాల పునర్నిర్మాణం, సామూహిక వివాహాలకు వారు చేస్తున్న సేవలను పలువురు కొనియాడారు.