వానొస్తే.. విద్యుత్తో జాగ్రత్త!...మునిచంద్ర ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్...
చిత్తూరు(ఆగస్టు 25),(ప్రభ ఎక్స్ ప్రెస్) డైలీ దినపత్రిక: వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్పీడీసీఎల్ చిత్తూరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మునిచంద్ర సూచించారు. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో విద్యుత్ స్తంభాలు, తీగలు, ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని తెలిపారు. తడి నేల, నీరు నిలిచిన ప్రాంతాల్లో విద్యుత్ ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.విద్యుత్ తీగలు తెగిపడి నేలపై కనిపించినా వాటిని తాకడం, పక్కకు తొలగించడం చేయరాదని సూచించారు. చిన్నపిల్లలు సైతం వాటి వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షం కురుస్తున్న సమయంలో తడి చేతులతో స్విచ్లు, విద్యుత్ పరికరాలను తాకరాదని చెప్పారు. ఇళ్లలో విద్యుత్ వైర్లు, ప్లగ్లు, స్విచ్లు దెబ్బతిన్నట్లయితే...