కరువు సహాయక చర్యలు చేపట్టి కూలీలకు పనులు కల్పించాలి

రాయచోటి, ఆగస్టు 24 (రాజనీతి): వలసల నివారణకు తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టి వ్యవసాయ కూలీలకు పనులు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్‌ చేసింది. పేదలకు సామాజిక న్యాయం, ఆత్మగౌరవం కల్పించాలని కోరుతూ అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు సిద్ధిగల శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం, 16 రకాల నిత్యావసర సరుకులు, రూ.10 వేల కరువు సాయం అందించాలని డిమాండ్‌ చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి...