శేషారెడ్డికి వైసీపీ నేతల జన్మదిన శుభాకాంక్షలు

ఎర్రావారిపాలెం, ఆగస్టు 23 (రాజనీతి): ఎర్రావారిపాలెం మండల వైసీపీ స్టూడెంట్‌ వింగ్‌ అధ్యక్షుడు శేషారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, చంద్రగిరి వైసీపీ ఇన్‌చార్జి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి అక్షిత్‌రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. శేషారెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ యువతను సమన్వయం చేయడంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. పార్టీ బలోపేతానికి భవిష్యత్తులోనూ కృషి చేస్తానని శేషారెడ్డి తెలిపారు.