ఆరోగ్య జాగ్రత్తలతో తల్లి, బిడ్డ సురక్షితం

పీలేరు, ఆగస్టు 22 (రాజనీతి): గర్భిణులు పోషకాహారం తీసుకుంటూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తే తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని పీహెచ్‌సీ తలుపుల డిప్యూటీ హెచ్‌ఈఓ కొండయ్య సూచించారు. ఎం.సి.పాలెంలో ఇంటింటి గర్భిణీ సేవల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఆకుకూరలు, తాజా కూరగాయలు, పండ్లు, సమతుల ఆహారం తీసుకోవాలని, క్రమం తప్పకుండా వైద్యుల సూచనలు పాటించాలని తెలిపారు. గర్భధారణ సమయంలో శారీరక, మానసిక మార్పులపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎన్‌ఎం వసుంధర, సీహెచ్‌ఓ నాగముత్యం, ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.