రైల్వే అధికారుల నిర్లక్ష్యమా? గేట్‌ మధ్యలో చిక్కుకున్న ప్యాసింజర్‌ ఆటో

రేణిగుంట, ఆగస్టు 22 (రాజనీతి): రేణిగుంట సంత ప్రాంగణం సమీపంలోని రైల్వే గేట్‌ వద్ద తీవ్ర ఆందోళనకర పరిస్థితి నెలకొంది. గేట్‌ ఎత్తిన వెంటనే తిరిగి మూసివేయడంతో ప్యాసింజర్‌ ఆటో గేట్‌ మధ్యలో ఇరుక్కుపోయింది. అదే సమయంలో రైలు కూడా వెళ్లడంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శనివారం సంత కావడంతో ఈ ప్రాంతంలో భారీగా జనసంచారం, వాహనాల రద్దీ ఉంటుంది. గేట్‌ నిర్వహణలో నిర్లక్ష్యం వల్లే ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర ఘటనలు పునరావృతం కాకుండా రైల్వే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కోరారు.