*దోమల అంతం ప్రతి ఒక్కడి పంతం కావాలి* డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ నాయక్
రాజనీతి | అమరావతి | ఆగస్టు 20, 2026 దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల నిర్మూలన ఏ ఒక్కడి బాధ్యత మాత్రమే కాదని, సామూహిక కృషి అవసరమని పి.హెచ్.సి తలుపుల ప్రధానవైద్యా ధికారులు డా:శ్రీగిరీష డా:చంద్రశేఖర్ సంయుక్తంగా తెలిపారు. నేడు ప్రపంచ దోమల దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటపల్లి ఆదర్శ స్కూల్, మరియు కోటపల్లె సర్కిల్ వద్ద పి.హెచ్.సి వివిధ స్థాయి అధికారులు,సిబ్బంది చే అవగాహన ర్యాలీ ప్రతిజ్ఞ,మానవాహారం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. దోమల ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల కలిగే ముప్పును వ్యక్తి,కుటుంభం, సమాజం,ముందస్తు నివారణ చర్యల ద్వారా ప్రమాదాన్ని తగ్గించే సులభతరమైన మార్గాలు అనేకమని, ఇంటి చుట్టుపక్కల నీరు నిలువలేకుండా చూడటం, దోమతెరలు, మస్కిటో...