బాధ్యతల స్వీకరణ నుంచి భక్తుల సంక్షేమమే ధ్యేయంగా...కాణిపాకం ఈవో పెంచల కిషోర్...
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయ కార్యనిర్వహణాధికారిగా (ఈవో) పెంచల కిషోర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆలయ పరిపాలనలో పలు కీలక మార్పులు, చర్యలకు శ్రీకారం చుట్టారు. భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించడం, ఆలయ ప్రతిష్ఠను మరింత పెంచడం, ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం, సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆలయానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు, భక్తులు ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాణిపాకం ఆలయానికి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు...