ఇరాన్‌పై అణుదాడి? అమెరికా వ్యూహ సమావేశాల్లో చర్చ..
రాజనీతి | అంతర్జాతీయ వార్తలు | ఆగస్టు 17, 2026 ఇరాన్‌పై అమెరికా అణ్వాయుధాలను ఉపయోగించే అంశం చర్చకు వచ్చిందంటూ అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యురాలు మార్జోరీ టేలర్ గ్రీన్ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా వ్యూహాత్మక సమావేశాల్లో ఇరాన్‌పై అణ్వాయుధాల వినియోగంపై చర్చ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు. అయితే, తన వాదనకు సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆమె బహిర్గతం చేయలేదు. ‘నేను ఊహించి చెప్పడం లేదు’ సోషల్ మీడియా వేదికగా స్పందించిన గ్రీన్.. ఈ విషయం నిజమేనని, తాను ఊహించి మాట్లాడటం లేదని పేర్కొన్నారు. ఇరాన్‌పై అణ్వాయుధాల వినియోగానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు....