జిల్లా.. రాష్ట్రం.. జాతీయం.. అన్నిచోట్లా ‘రాజు’దే రాజ్యం!....
సేవకు జేజేలు.. రాజశేఖర్‌రాజుకు అరుదైన గౌరవం.... 351 రివార్డులు.. ఇప్పుడు మూడు అత్యున్నత పురస్కారాలు... చిత్తూరు నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు..... చిత్తూరు(జ్ఞాన ప్రకాష్ జర్నలిస్ట్): విధి నిర్వహణలో ప్రతిభ అంకితభావం అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా చిత్తూరు జిల్లా నాన్ క్యాడర్ ఎస్పీ రాజశేఖర్ రాజు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలోనే అత్యధికంగా 351 రివార్డులు...అవార్డులు... ప్రశంసా పత్రాలు... కమెండేషన్లు... మెరిట్ సర్టిఫికెట్లు... మెడల్స్ అందుకున్న అత్యుత్తమ పోలీసు అధికారిగా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందడం చిత్తూరు జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చిత్తూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన వేడుకల్లో రాజశేఖర్ రాజు మూడు...