స్వామికేరి లోకేష్‌కు ఉత్తమ అవార్డు

వీరబల్లి: మైభారత్ నేషన్ ఛాలెంజ్ విన్నర్ ఎస్డికేఆర్ డిగ్రీ కళాశాల విద్యార్థి స్వామికేరి వెంకట లోకేష్ మదనపల్లి పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు నిర్వహించిన 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర రవాణా మరియు యువజన క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా అధికారుల చేతుల మీదుగా తన ప్రతిభను కనబరిచి ఉత్తమ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వెంకట లోకేష్ ను విఆర్డిఎస్ సురేంద్రారెడ్డి,కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.