కిడ్స్ కింగ్డమ్ ప్రీస్కూల్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
రేణిగుంట, ఆగస్టు 15 (రాజనీతి): దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తిని చిన్నారుల్లో నింపేలా పట్టణంలోని జి.ఎం. స్ట్రీట్ కిడ్స్ కింగ్డమ్ ప్రీస్కూల్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ గౌసేబి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు జాతీయ గీతాన్ని ఆలపిస్తూ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. వేడుకల్లో భాగంగా చిన్నారులు వివిధ స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశం కోసం పోరాడిన మహనీయుల వేషాల్లో చిన్నారులు కనిపించడంతో పాఠశాల ప్రాంగణం దేశభక్తి వాతావరణంతో కళకళలాడింది. చిన్నారుల వేషధారణను చూసి తల్లిదండ్రులు...