కోర్టు విధుల్లో అంకితభావం.. కానిస్టేబుల్ మనోహర్‌కు ఉత్కృష్ట సేవా పతకం
రేణిగుంట రూరల్, ఆగస్టు 15 (రాజనీతి): పోలీసు శాఖలో అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించిన రేణిగుంట రూరల్ గాజులమండ్యం పోలీస్ స్టేషన్ కోర్టు కానిస్టేబుల్ మనోహర్‌కు ఉత్కృష్ట సేవా పతకం లభించింది. తిరుపతి పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతుల మీదుగా ఆయన పతకం అందుకున్నారు. కోర్టు విధుల్లో కేసుల నిర్వహణ, పత్రాల సమన్వయం, నిందితుల హాజరు తదితర బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించినందుకు ఈ పురస్కారం దక్కింది. మనోహర్‌ను పోలీసు, న్యాయస్థాన సిబ్బంది అభినందించారు.