ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక!
రాజనీతి | అంతర్జాతీయ వార్తలు | ఆగస్టు 15, 2026 7.7 తీవ్రతతో కంపించిన ఫ్లోరెస్ ప్రాంతం.. భయంతో ఎత్తయిన ప్రాంతాలకు పరుగులు తీసిన ప్రజలు ఇండోనేషియాలో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో 7.7 తీవ్రతతో భూమి కంపించింది. సముద్ర తీరానికి సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో అధికారులు అప్రమత్తమై కొన్ని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. భూకంపం ప్రభావంతో పలు ప్రాంతాల్లో భవనాలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ప్రజలు భయాందోళనలకు గురై సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. కొన్ని ప్రాంతాల్లో ఆసుపత్రుల నుంచి రోగులను సైతం బయటకు తరలించినట్లు సమాచారం. సునామీ హెచ్చరిక జారీ.. ఆపై ఎత్తివేత భూకంపం...