సోమల సిగిల్విండో కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అన్నమయ్య జిల్లా,సోమల, రాజనీతి, ఆగస్టు 15: సోమల సిగిల్విండో కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సిగిల్విండో చైర్మన్ పి.వి. శివశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, జాతీయ సమైక్యతను కాపాడుతూ దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వరదం మహేంద్ర బాబు (చిన్నబాబు), పి ఎం మల్లికార్జున,పాయల శివకుమార్ ,అడుసుపల్లి మణి,మురళి,చాణిక్య,మైనార్టీ నాయకులు అష్రఫ్ అలీ, అమానుల్లా, కె.రత్నయ్య, గంగాధరం , వికాస్ కార్యాలయ సిబ్బంది, స్థానికులు...