రేణిగుంట రైల్వే స్టేషన్, బస్టాండ్‌లో విస్తృత తనిఖీలు
రేణిగుంట, ఆగస్టు 14 (రాజనీతి): దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రతి ఒక్కరూ ప్రశాంత వాతావరణంలో దేశభక్తి స్ఫూర్తితో ఆనందంగా జరుపుకోవాలని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ప్రజలకు సూచించారు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా రేణిగుంట పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. భద్రతా చర్యల్లో భాగంగా రేణిగుంట రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, ప్రయాణికుల రద్దీ ప్రాంతాలు, అనుమానాస్పద ప్రదేశాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. రైల్వే పోలీసు విభాగాలకు చెందిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ డాగ్ స్క్వాడ్ సహాయంతో స్టేషన్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ జయచంద్ర మాట్లాడుతూ...