సోమలలో ఘనంగా ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
రాజనీతి |అన్నమయ్య జిల్లా,సోమల| ఆగస్టు 14, 2026 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవన్నీ పురస్కరించుకొని దేశభక్తిని చాటుతూ బీజేపీ నియోజకవర్గ ఇంచార్జీ గన్నా మదన్మోహన్ బాబు ఆధ్వర్యంలో సోమల మండలంలో శుక్రవారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ ఘనంగానిర్వహించారు.ఈ ర్యాలీ సోమల హైస్కూల్ నుంచి ప్రారంభమై బస్ స్టాండ్ మీదుగా ఎంపీడీఓ కార్యాలయం వరకు ఎంపీడీఓ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు గాంధీ సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. జాతీయ జెండాలను చేతబూని విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు ర్యాలీలో పాల్గొన్నారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో సోమల పురవీధులు మార్మోగాయి. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఈ సందర్భంగా...