మానవత్వానికి మారుపేరు.. మాజీ సర్పంచ్ నగేశం

రేణిగుంట, ఆగస్టు 14 (రాజనీతి): మానవత్వం ఇంకా బతికే ఉందని చాటిచెప్పే ఘటన రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో చోటుచేసుకుంది. మండుటెండలో దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తూ నిస్సహాయంగా పడి ఉన్న ఓ వృద్ధుడిని గుర్తించిన రేణిగుంట గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్‌ నగేశం వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు. రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో వృద్ధుడు ఎండ వేడిమిని తట్టుకోలేక తీవ్ర అస్వస్థతతో పడి ఉండటాన్ని గమనించిన నగేశం అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని చూసి చలించిపోయిన ఆయన వృద్ధుడిని ఆప్యాయంగా పలకరించి, వెంటనే తాగునీరు అందించారు. అనంతరం ఆలస్యం చేయకుండా 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, వృద్ధుడిని వైద్య చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు...