గండబోయనపల్లి లో ఉచిత ఛాతి ఎక్స్-రే పరీక్షలు టీబీ ముక్త్ భారత్ కార్యక్రమంలో ప్రత్యేక వైద్య శిబిరము డిప్యూటీ. హెచ్. ఈ. ఓ. మహమ్మద్ రఫీ
రాజనీతి | వాయల్పాడు | ఆగస్టు 14, 2026: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్–2.0 కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు డి. ఎమ్. హెచ్. ఓ. మరియు జిల్లా టి. బి. అధికారి ఆధ్వర్యంలో వాయల్పాడు మండలంలోని గండ బోయన పల్లిలో స్థానిక పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ జులేక బేగం అధ్యక్షతన ఛాతీ ఎక్స్-రే పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరిగిందని డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి. బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుచు ఈ ప్రత్యేక వైద్య శిబిరాల్లో అనుమానిత టీబీ లక్షణాలు ఉన్నవారికి,...