పీలేరులో జాతీయ జెండాలతో సైకిల్ ర్యాలీ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల జోష్

హర్ ఘర్ తిరంగా - ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకం పీలేరులో వందేమాతరం నినాదాలతో ర్యాలీ పీలేరు: 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పీలేరులో సైకిల్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. గురువారం అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు చేతిలో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థిని విద్యార్థులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పీలేరు ఆర్డిఓ కె. విజయలక్ష్మి, తహశీల్దార్ శివకుమార్ పాల్గొని ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డిఓ కె. విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ...