ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి అన్నమయ్య జిల్లా పంటల పరిశీలన
అన్నమయ్య జిల్లాలో ఎల్ నినో పరిస్థితులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ, వేసిన పంటలు ఒత్తిడికి గురవుతున్నాయని తద్వారా ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యాయని ఆచార్య ఎన్ జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి.వి.సత్యనారాయణ గారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్ నినో ప్రభావంతో దెబ్బతిన్న వేరుశెనగ, పశుగ్రాస పంటలు టమోటా మొదలగు పంటలను కురబలకోట, గుర్రంకొండ, వాల్మీకిపురం, కలికిరి, పీలేరు మండలాల్లో యూనివర్సిటీ బృందంతో కలిసి పరిశీలించారు. అన్ని జిల్లాలలో చాలా తక్కువ వర్షపాతం నమోదయిందనీ, పంట విస్తీర్ణం కూడా 10 శాతం మాత్రమే ఉందనీ, బోర్లలో నీరు తగ్గి పోయి పంటలు కూడా వాడి ఎండిపోతున్నాయని పరిశోధనా సంచాలకులు డాక్టర్ వి.సుమతి వివరిస్తూ,...