వైన్‌ షాపులకు వ్యతిరేకంగా ఐద్వా వీధి నిరస

రేణిగుంట, ఆగస్టు 12 (రాజనీతి): పట్టణంలోని నూతన మద్యం దుకాణాలను ఊరి బయటకు తరలించాలని డిమాండ్‌ చేస్తూ ఐద్వా ఆధ్వర్యంలో పాంచాలినగర్‌లో చేపట్టిన వీధి నిరసనలు బుధవారం ఐదో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఐద్వా ప్రతినిధులు రేణిగుంట డీఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాల నిర్వహణతో మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు ఇబ్బందులు, భద్రతా సమస్యలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి మద్యం దుకాణాలను నివాస ప్రాంతాలకు దూరంగా తరలించేలా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఐద్వా నేతలు కొండ్రెడ్డి ఈశ్వరమ్మ, భారతి, పద్మావతి, సీపీఎం నేత కె. హరినాథ్‌, స్థానిక మహిళలు పాల్గొన్నారు.