నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవం.. 2026 థీమ్ ‘విభిన్న పరిస్థితులు.. ఉమ్మడి ఆశయాలు’
రాజనీతి | ప్రత్యేక కథనం | ఆగస్టు 12, 2026 దేశ భవిష్యత్తును నిర్మించే శక్తిగా యువతను గుర్తిస్తూ ప్రతి ఏటా ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి అందాల్సిన అవకాశాలు, సమాజ అభివృద్ధిలో వారి భాగస్వామ్యంపై ప్రపంచవ్యాప్తంగా చర్చించేందుకు ఈ రోజు ఒక వేదికగా నిలుస్తోంది. 2026 అంతర్జాతీయ యువజన దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి “Different Contexts, Common Aspirations” అనే థీమ్‌ను ప్రకటించింది. భిన్న దేశాలు, ప్రాంతాల్లో యువత జీవన పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ.. మెరుగైన భవిష్యత్తు, గౌరవం, అవకాశాలు, నిర్ణయాల్లో భాగస్వామ్యం వంటి వారి ప్రాథమిక ఆకాంక్షలు మాత్రం ఒకే విధంగా ఉంటాయనే సందేశాన్ని ఈ...