ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సందేశం.. వన్యప్రాణి సంరక్షణకు సమష్టి కృషి చేయాలని పిలుపు

రాజనీతి | అమరావతి | ఆగస్టు 12, 2026 ఏనుగుల సంరక్షణతో పాటు వాటి సహజ ఆవాసాలు, సంచార మార్గాలను కాపాడాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆయన ఏనుగుల పరిరక్షణపై ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ఏనుగులు కేవలం అడవుల్లో సంచరించే వన్యప్రాణులు మాత్రమే కాదని.. అవి అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. అడవుల ఆరోగ్యాన్ని కాపాడటంలో, పర్యావరణ సమతుల్యతను కొనసాగించడంలో ఏనుగుల ఉనికి ఎంతో ముఖ్యమని తెలిపారు. సంచార మార్గాలను కాపాడాలి ఏనుగులు తరతరాలుగా ఉపయోగిస్తున్న సహజ సంచార మార్గాలను...