గంగమ్మ జాతర నిర్వాహకులతో డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర సమావేశం

రేణిగుంట, ఆగస్టు 11 (రాజనీతి): రేణిగుంటలో భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న శ్రీ గంగమ్మ జాతరను ఆధ్యాత్మిక వాతావరణానికి ఏమాత్రం భంగం కలగకుండా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా, వైభవంగా నిర్వహించేందుకు పోలీసులు ముందస్తు చర్యలను ముమ్మరం చేశారు. అమ్మవారి జాతర సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నియంత్రణ, ఊరేగింపు నిర్వహణ, భక్తుల రక్షణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జాతర నిర్వహణలో పోలీసులు, ఆలయ నిర్వాహకులు, ప్రజలు, భక్తులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని గుర్తించి డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ జయచంద్ర జాతర నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర ఏర్పాట్లు, అమ్మవారి ఊరేగింపు, భక్తుల...