మాతాశిశు సంరక్షణ కొరకు ఆధునీకరించిన తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్, ఎమ్. ఎల్. ఏ.
మదనపల్లి | ఆగస్టు 11, 2026 మాతాశిశు సంరక్షణ లో భాగంగా గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడానికి గాను దేశము లోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం ఆధునికరించిన తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహన సేవలను అందుబాటులో కి తెచ్చింది.ఈ రోజు మంగళవారం జిల్లా కేంద్రం లోని ఆస్పత్రి ప్రాoగనములో గౌరవ జిల్లా కలెక్టర్ శివనారాయణ శర్మ మరియు మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సాజహాన్ బాషా తల్లీ బిడ్డ ఎక్సప్రెస్ వాహన సేవలను పూజ కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుచు అదునాతన సౌకర్యాలలో భాగంగా ఆరు ఎయిర్ బ్యాగ్స్, అత్యవసర సమయం లో మహిళలకు వెంటనే...