ఎల్‌నినో ప్రభావాన్ని అధిగమించి 10.7% వృద్ధి.. శాఖలన్నీ లక్ష్యాలు చేరుకోవాలని సీఎం ఆదేశం

అమరావతి | ఆగస్టు 11, 2026 ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక ప్రగతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారించారు. అమరావతిలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (GSDP), జూలై నెల ఆర్థిక పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. ప్రణాళికా విభాగం అధికారులు తాజా ఆర్థిక నివేదికను సీఎంకు సమర్పించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేసిందని అధికారులు సీఎంకు వివరించారు. 2025–26 రెండో త్రైమాసికంలో రాష్ట్ర వృద్ధిరేటు 10.7 శాతంగా నమోదైనట్లు తెలిపారు. రంగాల వారీగా చూస్తే వ్యవసాయ రంగం 13.5 శాతం, పారిశ్రామిక రంగం 10.6 శాతం,...