రేపే సంపూర్ణ సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?

రాజనీతి సైన్స్ ప్రత్యేక కథనం | ఆగస్టు 11, 2026 2026లో సంభవించనున్న రెండోది, చివరిది అయిన సంపూర్ణ సూర్యగ్రహణం ఆగస్టు 12న ఏర్పడనుంది. చంద్రుడు సూర్యుడికి, భూమికి మధ్యకు వచ్చి సూర్యుడిని పూర్తిగా కప్పివేసినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈసారి గ్రీన్‌ల్యాండ్‌, ఐస్‌లాండ్‌, ఉత్తర రష్యా, స్పెయిన్‌, పోర్చుగల్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంపూర్ణ గ్రహణం కనిపించనుంది. భారత్‌లో కనిపించదు ఈ గ్రహణాన్ని చూసేందుకు భారతీయులు మాత్రం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 12న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణం భారత్‌ నుంచి కనిపించదు. గ్రహణ మార్గం ప్రధానంగా ఉత్తర అర్ధగోళంలోని కొన్ని ప్రాంతాల మీదుగా సాగుతుంది. యూరప్‌లోని అనేక ప్రాంతాలు, ఉత్తర అమెరికా, వాయవ్య ఆఫ్రికాలో...