అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఏపీ యువ టెక్కీ దుర్మరణం!

రాజనీతి | ఆంధ్రప్రదేశ్‌ | ఆగస్టు 11, 2026 మాస్టర్స్‌ పూర్తి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం.. అంతలోనే రోడ్డు ప్రమాదం | 26 ఏళ్ల దిలీప్‌ కుమార్‌ మృతి అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కుటుంబంలో విషాదం నింపింది. కడప జిల్లాకు చెందిన 26 ఏళ్ల దిలీప్‌ కుమార్‌ బుంగటావుల ఓహియోలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఆయన.. కెంట్‌ స్టేట్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ పూర్తి చేసి అక్కడే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం ప్రారంభించిన కొద్దికాలానికే ఈ విషాదం చోటుచేసుకుంది. ఎదురుగా వచ్చి.. ఒక్కసారిగా ఢీకొట్టిన ట్రక్‌ పోలీసుల వివరాల...