ఈఏపీసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో జోరు.. తొలి విడతలోనే లక్షకుపైగా సీట్లు భర్తీ!
రాజనీతి | ఆంధ్రప్రదేశ్ | ఆగస్టు 11, 2026 70.87 శాతం సీట్లు భర్తీ.. ప్రైవేటు వర్సిటీల్లో 92 శాతం సీట్లకు డిమాండ్ ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ తొలి విడతలో విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్న 1,51,312 సీట్లలో 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో తొలి విడతలోనే 70.87 శాతం సీట్లు నిండాయి. ఈ ఏడాది ఏపీ ఈఏపీసెట్‌కు 1,74,802 మంది అర్హత సాధించగా.. 1,13,488 మంది ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం 1,12,285 మంది ప్రవేశాలకు అర్హత పొందారు. వీరంతా తమకు నచ్చిన కళాశాలలు, బ్రాంచీల కోసం వెబ్ ఆప్షన్లు...