జూడాల సమ్మె సైరన్‌.. 15లోగా నిర్ణయం తీసుకోకపోతే 17 నుంచి సమ్మె!

రాజనీతి ప్రతినిధి | అమరావతి | ఆగస్టు 11, 2026 స్టైఫండ్‌ పెంపుపై ఏపీ జూనియర్‌ డాక్టర్ల డెడ్‌లైన్‌.. నల్లబ్యాడ్జీలతో విధులు, 9 నుంచి 4 వరకు అత్యవసర సేవల బహిష్కరణ ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ డాక్టర్లు తమ స్టైఫండ్‌ పెంపు డిమాండ్‌పై ఆందోళనను తీవ్రతరం చేసేందుకు సిద్ధమయ్యారు. ఆగస్టు 15లోగా ప్రభుత్వం తమ డిమాండ్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని APJUDA గడువు విధించింది. అప్పటిలోగా సానుకూల స్పందన రాకపోతే ఆగస్టు 17 నుంచి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం నిరసనలో భాగంగా ఆగస్టు 15 వరకు జూనియర్‌ డాక్టర్లు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కానున్నారు. స్టైఫండ్‌ పెంపుపై ప్రభుత్వం తక్షణమే నిర్ణయం...