పతక వీరులతో మోదీ ముచ్చట్లు.. “జో ఖేలేగా.. వో ఖిలేగా”
రాజనీతి ప్రతినిధి | న్యూఢిల్లీ | ఆగస్టు 10, 2026 కామన్వెల్త్ గేమ్స్-2026లో దేశానికి పతకాలు అందించిన క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఆదివారం న్యూఢిల్లీలోని తన నివాసంలో భారత పతక విజేతలతో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో క్రీడాకారులు కనబరిచిన ప్రతిభను ప్రశంసిస్తూ, వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో జరిగిన సరదా సంభాషణకు సంబంధించిన వీడియోను మోదీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన సాక్షి చౌదరి మోదీని కొన్ని మాటలు చెప్పాలని కోరగా.. “జో ఖేలేగా, వో ఖిలేగా.. ఆల్వేస్ చీర్ ఫర్ భారత్” అంటూ ప్రధాని ఉత్సాహపరిచారు....