పొగాకు రైతులకు భారీ ఊరట.. క్వింటాల్‌కు రూ.1,000 అదనం!
రాజనీతి ప్రతినిధి | అమరావతి | ఆగస్టు 10, 2026 పొగాకు ధరల సమస్యతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు ప్రకటించింది. రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రతి క్వింటాల్ పొగాకుకు ప్రభుత్వం తరఫున రూ.1,000 అదనపు సాయం అందించాలని నిర్ణయించింది. దీంతో పాటు రైతులకు రూ.50 వేల వరకు వడ్డీలేని రుణాలను రెండేళ్ల కాలపరిమితితో అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పొగాకు ధరలు, కొనుగోళ్ల పరిస్థితిపై మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయస్వామి సమీక్ష నిర్వహించారు. రైతులకు సరైన ధర లభించేలా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు నాణ్యత నిర్ధారణకు ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు....