చైనాను వణికించిన ‘డాల్ఫిన్’ తుపాను 10 లక్షల మందికి పైగా సురక్షిత ప్రాంతాలకు తరలింపు

రాజనీతి అంతర్జాతీయ ప్రతినిధి | ఆగస్టు 10, 2026 చైనాలో ‘డాల్ఫిన్’ టైఫూన్ తీవ్ర ప్రభావం చూపింది. బలమైన గాలులు, భారీ వర్షాలతో తూర్పు తీర ప్రాంతాలు అతలాకుతలమవుతుండటంతో అధికారులు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టారు. తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్‌ తీరాన్ని ఆగస్టు 9న డాల్ఫిన్ తుపాను తాకింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం సమయంలో తైజౌ నగరంలోని యుహువాన్ ప్రాంతంలో తొలిసారి తీరం దాటిన తుపాను.. కొద్దిసేపటికే వెన్‌జౌ సమీపంలో మరోసారి ల్యాండ్‌ఫాల్ చేసినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు. తుపాను తీవ్రత దృష్ట్యా చైనా కేంద్ర వాతావరణ...