యువతే బలం.. ఎయిడ్స్‌పై అవగాహనే ఆయుధం

రాజనీతి ప్రతినిధి, మదనపల్లి | ఆగస్టు 10, 2026 అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మదనపల్లిలో అవగాహన కార్యక్రమం.. పోస్టర్లు, బుక్‌లెట్ల ఆవిష్కరణ అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లి జిల్లా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువతలో హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై అవగాహన పెంచడంతో పాటు, వ్యాధి నివారణ, సురక్షిత జీవన విధానంపై ప్రజలకు సమాచారాన్ని చేరవేసే ఉద్దేశంతో ఎయిడ్స్‌ సురక్ష కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లు, బుక్‌లెట్లు, ఐఈసీ ప్రచార సామగ్రిని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, మదనపల్లి సబ్‌ కలెక్టర్, డీఆర్‌ఓ, డీఎంహెచ్‌ఓ డా. లక్ష్మీ నరసయ్య, డీసీహెచ్‌ఎస్ డా. లక్ష్మీ ప్రసాద్, డీఎల్‌ఏటీఓ డా. రాధిక, డీపీఎంఓ డా....