పుంగనూరు నియోజకవర్గ బీసీవై పార్టీ నూతన కమిటీ
పుంగనూరు, ఆగస్టు 10 (రాజనీతి): భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై) పుంగనూరు నియోజకవర్గ నూతన కమిటీని పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఆమోదంతో ప్రకటించినట్లు నియోజకవర్గ కన్వీనర్ హరిబాబు యాదవ్ ఎద్దుల తెలిపారు. నియోజకవర్గంతో పాటు వివిధ మండలాలు, పంచాయతీలు, బూత్‌లకు యూత్, మహిళా, ఎస్సీ సెల్ కన్వీనర్లు, కో-కన్వీనర్లను నియమించినట్లు చెప్పారు. నూతన కమిటీ సభ్యులు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.