జైల్‌భర్ కార్యక్రమంలో రైతు సంఘాల నేతల అరెస్టు
మదనపల్లె, ఆగస్టు 10: సంయుక్త రైతు వ్యవసాయ ట్రేడ్ యూనియన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన జైల్‌భర్ కార్యక్రమంలో పలువురు రైతు, కార్మిక సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం (BKMU) అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి తోపు కృష్ణప్ప, రైతు సంఘం రాష్ట్ర నాయకులు టీ. జనార్ధన్, DHPS జిల్లా కార్యదర్శి ఎం. హరికుమార్, BKMU మదనపల్లె నియోజకవర్గ కార్యదర్శి ఎల్.ఎం. మునిరత్నం నాయుడు, AITUC RTC రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ. గజపతి తదితరులు పాల్గొన్నారు.