అభివృద్ధి కొనసాగాలంటే కూటమికే అండ...చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్
చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారథ్యంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందిస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్ అన్నారు. ‘రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలన–ఇంటింటి ప్రచారం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత్రి చిత్తూరు నగరపాలక పరిధిలోని 12వ వార్డు రామాపురం గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ‘సూపర్ సిక్స్’ హామీల అమలు తదితర అంశాలను ప్రజలకు వివరించారు. ప్రభుత్వ విజయాలను వివరించే కరపత్రాలను ప్రతి ఇంటికీ పంపిణీ చేశారు. కూటమి...