సౌత్ ఇండియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత డేవిడ్ అరక్కోణం
రేణిగుంట, ఆగస్టు 9 (రాజనీతి): రేణిగుంట రైల్వే ఇన్‌స్టిట్యూట్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మూడు రోజులుగా ఉత్కంఠభరితంగా సాగిన సౌత్ ఇండియన్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ ఆదివారం ఘనంగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించిన డేవిడ్ అరక్కోణం జట్టు విజేతగా నిలవగా, తిరుపతి డైనమోస్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఇరు జట్ల ఆటతీరుతో క్రీడాభిమానులు ఉత్సాహంతో సందడి చేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నమెంట్‌లో దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జట్లు పాల్గొని తమ ప్రతిభను చాటాయి. ప్రారంభ మ్యాచ్‌ల నుంచి సెమీఫైనల్ వరకు హోరాహోరీ పోటీలు జరగగా, ఫైనల్ మ్యాచ్‌పై క్రీడాభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఫైనల్‌లో...