ప్రజా సేవలో మహిళా నేత లీలావతి.......
టీడీపీ బలోపేతానికి అంకితభావం.. అభివృద్ధిపై అవగాహనతో ముందడుగు.... విమర్శలు ఎన్ని వచ్చినా...ప్రజా సమస్యలే ప్రథమ ప్రాధాన్యం... చిత్తూరు(జర్నలిస్ట్ జ్ఞాన ప్రకాష్): పార్టీ బలోపేతం.. మహిళల భాగస్వామ్యం.. ప్రజా సమస్యల పరిష్కారం...నియోజకవర్గ అభివృద్ధిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా చిత్తూరు నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు లీలావతి ముందుకు సాగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మహిళా కార్యకర్తలను సమన్వయం చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ తనదైన ముద్ర వేస్తున్నారు. పార్టీ కోసం...ప్రజల కోసం.. టీడీపీ సిద్ధాంతాలు,కూటమి ప్రభుత్వ లక్ష్యాలు,ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో లీలావతి పనిచేస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచుతూ.. కార్యకర్తల మధ్య సమన్వయం సాధించేందుకు...