డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ భాకరాపేటలో వైసీపీ దీక్షలు

డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భాకరాపేటలో శనివారం రిలే, నిరాహార దీక్షలు చేపట్టారు. చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైసీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.