డీఎస్సీ అక్రమాలపై పీలేరులో మూడో రోజు రిలే దీక్ష

పీలేరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై మూడో రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు పాల్గొని డీఎస్సీ నియామకాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులకు న్యాయం చేయడంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరారు.