గాజులమండ్యంలో ఘనంగా ఆడికృతిక మహోత్సవాలు
రేణిగుంట, ఆగస్టు 7 (రాజనీతి) : రేణిగుంట మండలం గాజులమండ్యం గ్రామంలోని శ్రీ బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో ఆడికృతిక మహోత్సవాలు శుక్రవారం అత్యంత భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకుని ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఆలయ పరిసరాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో సందడిగా మారాయి. గాజులమండ్యం గ్రామంతో పాటు రేణిగుంట మండలంలోని పరిసర గ్రామాలు, సమీప ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రధాన ద్వారం, గర్భగుడి పరిసరాలు, ప్రాంగణం, ఆలయ వీధులను రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు....