పెద్దిరెడ్డి కుటుంబం క్షేమం కోసం అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

రాజస్థాన్‌లోని అజ్మీర్ దర్గాలో మాజీ మున్సిపల్ చైర్మన్ అలీమ్ బాషా ఆధ్వర్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చాదర్ సమర్పించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రార్థించినట్లు అలీమ్ బాషా తెలిపారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.